---Advertisement---

జీడిమెట్లలో తల్లి హత్య కేసు మిస్టరీ వీడింది: ప్రేమలో పడ్డ బాలికే నిందితురాలు!

a police warn rope in forest, rope color was yellow
---Advertisement---

హైదరాబాద్ జీడిమెట్లలో జరిగిన తల్లి హత్య కేసు వెనుక 16 ఏళ్ల బాలికే ఉందన్న షాకింగ్ నిజాన్ని పోలీస్‌లు బయటపెట్టారు. ప్రేమ వ్యవహారంపై తల్లి అంగీకరించకపోవడంతో ఈ దారుణానికి పాల్పడింది. తన బాయ్‌ఫ్రెండ్ మరియు అతని తమ్ముడిని కలిసి ఈ హత్య ప్లాన్ చేసి, 24 గంటల్లో కేసు వీడ్చేసిన పోలీస్‌లు ముగ్గురినీ అరెస్ట్ చేశారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే… శాపూర్‌నగర్‌లోని ఓ ఇంట్లో జూన్ 23 సాయంత్రం ఘటనా చోటుచేసుకుంది. సట్ల అంజలి అనే మహిళ ఇంట్లో ఒంటరిగా ఉన్న టైంలో, ఆమె కూతురు – 16 ఏళ్ల బాలిక – తమ్ముణ్ని బయటకు పంపించి తన బాయ్‌ఫ్రెండ్ శివ కుమార్ (19, నల్గొండకు చెందిన ఇంటర్మీడియట్ స్టూడెంట్ మరియు DJ ఆపరేటర్)తో పాటు అతని మైనర్ తమ్ముడిని ఇంట్లోకి రప్పించింది.

తల్లి ఒంటరిగా ఉందన్న సంగతి తెలిసిన బాలిక, ఇద్దరితో కలిసి ముందే ప్లాన్‌ చేసుకున్నట్టుగా, తల్లిని నైలాన్ రోప్, స్కార్ఫ్‌తో బిగించి గొంతు ముల్లగి చంపేశారు. హత్య తర్వాత బాలిక ఇంటికి తాళం వేసి, తమ్ముణ్ని ఎవరికైనా చెప్పొద్దని హెచ్చరించింది. కానీ చిన్నారి ఏమీ అర్ధం కాక ఆంటీకి చెప్పడంతో అసలు విషయం బయటపడింది.

విక్టిమ్ చెల్లెలి ఫిర్యాదు ఆధారంగా జీడిమెట్ల పోలీసులు కేసు బుక్ చేసి, సైంటిఫిక్ అనాలసిస్ ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. విచారణలో ముగ్గురూ తల్లి హత్య చేశామన్న సంగతిని ఒప్పుకున్నారు.

ఈ కేసులో శివకుమార్‌ను జుడిషియల్ కస్టడీకి పంపగా, మిగతా ఇద్దరు మైనర్‌లను జువెనైల్ జస్టిస్ బోర్డు ముందు హాజరు పరిచారు.

ఇక మరోవైపు మీడియాలో వచ్చిన వదంతులపై స్పష్టత ఇచ్చిన శ్వేతా – చాకలి ఇల్లమ్మ మనవదలిగా పేరు గాంచిన వ్యక్తి – అంజలి తమ కుటుంబానికి సంబంధించినవారు కాదని చెప్పారు. “అంజలీ గారు మా కుటుంబానికి సంబంధం లేదు. అసలే విషాదంగా ఉన్న ఘటనకు కుల, కుటుంబ సంబంధాలు కలిపేయడం తగదు. ఆమె మరణాన్ని మేం తీవ్రంగా సంతాపిస్తున్నాం,” అని తెలిపారు.

ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపినప్పటికీ, పోలీసుల వేగవంతమైన దర్యాప్తుతో 24 గంటల్లోనే మిస్టరీ వీడిపోవడం పోలీస్ డిపార్ట్‌మెంట్‌పై నమ్మకాన్ని పెంచుతోంది.

Also Read:

Join WhatsApp

Join Now
---Advertisement---