---Advertisement---

కమల్ హాసన్ సినిమా ‘Thug Life’ మీద సుప్రీం కోర్టు మాస్ డెసిషన్: కర్ణాటక వదిలేయాలి!

కమల్ హాసన్ సినిమా 'Thug Life' మీద సుప్రీం కోర్టు
---Advertisement---

కమల్ హాసన్ నటించిన ‘Thug Life’ అనే సినిమా మీద కర్ణాటకలో కొంత హడావిడి జరిగింది. కానీ ఆ హడావిడిని సుప్రీం కోర్టే దబాయించింది. జూన్ 5న దేశవ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమా కర్ణాటకలో మాత్రం ఆగిపోయింది. కారణం?

కమల్ హాసన్ చెన్నైలో జరిగిన ప్రెస్ మీట్‌లో “కన్నడ భాష తమిళం నుండే పుట్టింది” అన్నాడట. ఈ మాట కర్ణాటకలో కొందరికి బాగా పట్టకుండా పోయింది. ఫలితంగా బెదిరింపులు వచ్చాయి. అప్పుడే KFCC (కర్ణాటక ఫిలిం చాంబర్) ఓ బోర్డు పెట్టేసింది క్షమాపణ లేకుండా సినిమా ఎంటర్ అవ్వదు అన్నట్టుగా.

దీన్ని చూసిన ఓ మహేష్ రెడ్డి అనే వ్యక్తి డైరెక్ట్‌గా సుప్రీం కోర్టుకెళ్లి PIL వేసాడు. కోర్టులో కేసు విన్న జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ మన్మోహన్ ఇద్దరూ ఒక్క మాట చెప్పారు సినిమాకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (CBFC) అప్రూవల్ ఉందంటే, ఆ సినిమాను స్టేట్ ఏదైనా రిలీజ్ చెయ్యాలి.

బెదిరింపులు, ర్యాలీలతో సినిమాలు ఆగడం చట్టానికి తలవంచినట్టే. ఇంకో మాట కూడా కొట్టేశారు కమల్ హాసన్ ఏదైనా తప్పుగా అన్నాడంటే ఆ మాటకి తగిన డిబేట్ జరగాలి, కానీ దాన్ని అడ్డుకుని సినిమా ఆపేయడం అనేది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం.

కర్ణాటక హైకోర్టు ఇప్పటికే కమల్ హాసన్ క్షమాపణ చెప్పాలని గట్టిగానే చెప్పింది. అయితే సుప్రీం కోర్టు మాత్రం “క్షమాపణ చెప్పమని న్యాయస్థానం చెప్పడం సరిఅయిన పద్ధతి కాదు” అని స్ట్రాంగ్ కౌంటర్ వేసింది. ఈ కేసును మొత్తం హైకోర్టు నుంచి తన వద్దకు తీసుకుని, జూన్ 18న తర్వాత మళ్లీ వాదనలు వినబోతుంది.

ఇంకా ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, “రోడ్ల మీద కొందరు బెదిరించినందుకు సినిమా ఆపేస్తే, రేపట్నించి ఎవడైనా ఏ సినిమా అయినా అడ్డుకుంటాడు” అన్నట్టే సుప్రీం కోర్టు భావం. ఇది చిన్న విషయం కాదు, పెద్ద సిగ్నల్. ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వానికి ఒక రోజు టైమ్ ఇచ్చింది ఏం నిర్ణయం తీసుకుంటారో చెప్పాలని.

మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతో కమల్ హాసన్ మళ్లీ పవర్‌ఫుల్‌గా రీఎంట్రీ ఇచ్చాడు. అంతేకాదు, విజయ్ సేతుపతి, జయం రవి, త్రిష లాంటి వాళ్లతో కలిసి జూన్ 5న థియేటర్లలోకి వచ్చేసింది. కానీ కర్ణాటకలోనే ఒకే ఒక్క అడ్డు. ఇప్పుడు సుప్రీం కోర్టు తెరపైకి వచ్చేసినట్టుగా, ఆ అడ్డం కూడా తొలగిపోతుందేమో చూడాలి.

సినిమా అనే పేరు తీసుకుంటే అది కళ మాత్రమే కాదు, భావాలను, వ్యక్తిత్వాన్ని societyకి చెప్పే మాధ్యమం. దాన్ని గౌరవించాలి. బెదిరింపులతో ఓ సినిమా నిలిపేస్తే, రేపటి ఆర్టిస్టులు బయటకు రావడానికి ఆలోచిస్తారు. సుప్రీం కోర్టు ఇప్పుడు చెప్పింది కూడా అదే. ఇప్పుడు బంతి కర్ణాటక ప్రభుత్వ కోర్టులో ఉంది. కానీ ఈసారి, ఆ బంతిని మిస్ అవ్వకూడదు.

Join WhatsApp

Join Now
---Advertisement---