---Advertisement---

మన్చిర్యాల్‌ లో విద్యార్థిని ఆత్మహత్య యత్నం హాస్టల్ మూడో అంతస్తు నుండి దూకి గాయాలు

hospital beds ward in a hospital
---Advertisement---

మన్చిర్యాల్‌లో ఓ గర్ల్స్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజీలో బీఎస్సీ చదువుతున్న రెండో సంవత్సరం విద్యార్థిని ఆత్మహత్యకు ప్రయత్నించి తీవ్రంగా గాయపడింది. మంగళవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. హాస్టల్ మూడో అంతస్తు నుంచి దూకడంతో స్వప్న అనే అమ్మాయికి తల భాగాన గాయాలు అయ్యాయ్, ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు.

కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని బెజ్జూరు మండలం నుంచి వచ్చి చదువుతున్న స్వప్న, washroom కి వెళ్తానంటూ బయటకు వెళ్లిన తర్వాతే ఈ దూకుడు జరిగింది. ఆమె ఇంటి వారు, స్నేహితులు ఇంకా షాక్ లోనే ఉన్నారు. ఆత్మహత్యకు కారణం ఇంకా క్లియర్ కావాల్సి ఉంది.

పోలీసులు హాస్టల్ లోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. అదే విధంగా హాస్టల్ సిబ్బంది, ఫ్రెండ్స్ నుంచి స్టేట్‌మెంట్స్ తీసుకుంటున్నారు. స్వప్నకు ఏదైనా వ్యక్తిగత సమస్య ఉందా లేక చదువులో ఒత్తిడా అన్నదానిపై దర్యాప్తు సాగుతుంది.

ఈ సంఘటనతో మిగతా విద్యార్థుల మధ్య టెన్షన్ వాతావరణం నెలకొంది. కాలేజీ యాజమాన్యం, వెల్ఫేర్ శాఖ అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి స్టేట్‌మెంట్ ఇవ్వలేదు. బాధితురాలిని వెంటనే హాస్పిటల్ కి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోందని, ఇంకా క్రిటికల్ స్టేజీలో ఉందని సమాచారం.

ఇంకా ఏమైందో తెలియాలంటే పూర్తి దర్యాప్తు అనంతరం క్లారిటీ వస్తుందని పోలీసులు చెబుతున్నారు. మరి ఇదంతా నిజంగా ఆత్మహత్యాయత్నమేనా లేక మరేదైనా అంశమా అనేది పోలీస్ విచారణతో బయటపడాలి.


Also Read:

Join WhatsApp

Join Now
---Advertisement---