---Advertisement---

కడసారి సెల్ఫీ.. విమాన ప్రమాదంలో బలైన రాజస్థాన్ కుటుంబం – ఫోటో వైరల్!

air-india-crash-rajasthan-family-last-selfie
---Advertisement---

ఒక కొత్త జీవితం కోసం లండన్ వెళ్తున్న ఓ కుటుంబం.. కాని ఆ జీవితం మొదలయ్యే ముందు చివరి క్షణాల్లో తీసుకున్న సెల్ఫీనే వారి చివరి జ్ఞాపకం అయిపోయింది.

రాజస్థాన్ బంస్వారాకు చెందిన డాక్టర్ కౌమీ వ్యాస్, ఆమె భర్త ప్రతిక్ జోషి, పిల్లలు మిరయా, ప్రత్యుత్, నకుల్‌ – ఐదుగురి కుటుంబం అందరూ ఏయిరిండియా AI171 విమానంలో ప్రయాణించగా, అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.

వారంతా విమానం ఎక్కేముందు దిగిన సెల్ఫీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వివరాల్లోకి వెళ్తే…

2025 జూన్ 12న మధ్యాహ్నం 1:38కి ఎగిరిన ఏయిరిండియా AI171 ఫ్లైట్.. కేవలం 33 సెకండ్ల లోపే క్రాష్ అయింది.

బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ మోడల్ విమానంలో మొత్తం 242 మంది ఉండగా, 230 మంది ప్యాసింజర్లు, 12 మంది సిబ్బంది ఉన్నారు. అందులో 241 మంది మరణించగా, ఒక్కరే సజీవంగా బయటపడ్డారు.

విమానం క్రాష్ అయినప్పుడు అహ్మదాబాద్ BJ మెడికల్ కాలేజీ ఇంటర్న్ హాస్టల్ భవనాన్ని ఢీకొంది. పైగా, ప్రమాదంలో స్థానికంగా నివసిస్తున్న వాళ్లు కూడా చనిపోయినట్లు అధికారులు ధృవీకరించారు. మొత్తం మృతుల సంఖ్య 260కి చేరింది.

ప్రత్యుత్, నకుల్ అనే జంటలుగా పుట్టిన ఇద్దరు పిల్లలు, అక్క మిరయా – వీళ్లందరికీ లండన్‌లో చదువు, భవిష్యత్తు కోసం కొత్త ప్రయాణం మొదలవుతుండగా.

అది మరణ ప్రయాణంగా మారిపోయింది. కౌమీ వ్యాస్ ఒక ప్రైవేట్ హాస్పిటల్‌లో డాక్టర్‌గా పనిచేస్తుండగా, ప్రతిక్ జోషి లండన్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. కుటుంబం మొత్తాన్ని లండన్‌కు తీసుకెళ్లేందుకు ఇండియాకు వచ్చాడు. కానీ ఆ ప్రయాణమే చివరిది అయింది.

ప్రతిక్ జోషి విమానంలో ఉన్నపుడు సెల్ఫీ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ సెల్ఫీలో అందరూ నవ్వుతూ కనిపించగా, ఇప్పుడు అది చివరి చిరునవ్వుగా మిగిలింది. ఆ సెల్ఫీ చూసిన ప్రతి ఒక్కరూ కన్నీటిపారుస్తున్నారు.

ఈ ప్రమాదం భారత వైమానిక చరిత్రలో అతిపెద్ద విపత్తుల్లో ఒకటిగా నమోదైంది. దాదాపుగా అన్ని కుటుంబాలే ఒక క్షణం లోపే మాయమయ్యాయి. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుగుతున్నా, ఈ ఘటనను ఎప్పటికీ మరిచిపోలేరు.

Join WhatsApp

Join Now
---Advertisement---